అతడు – ఆమె
poetry
telugu
sonta-kavitvam
‘నీ జుట్టంటే నాకెంతిష్టమో తెలుసా’
చెవిలో గుసగుసలాడుతూ
సుతారంగా చేతివేళ్ళతో
కురుల కొసల్ని సవరించి
తాకీ తాకనట్లు
అతని మెడ వెనుక
ముద్దాడిందామె.
******************
తిండి ముందే ముగించి
మూడంకె వేసి
ముసుగు తన్ని
బిగుసుకు పడుకున్నా
ఒడుపు తెలిసి
మత్తుజల్లి
మోహపుచ్చి
నిద్రలేపి
రెచ్చగొట్టి
అతని ఆర్తి తీర్చి
లాలించి
బుజ్జగించి
అలుపు తీర్చి
నిద్రపుచ్చిందామె
కవిత్వంలోనూ, చాలావరకు నిజ జీవితంలోనూ, ఇవన్నీ అతడు చేయడం, ఆమె చేయనివ్వడం చూసి చూసి… 🙂