Afterthoughts on the lovers // Lisel Muellerఆ ప్రేమికుల చుట్టూ తిరుగుతున్న తలపులు

poetry
translation
telugu
Published

March 30, 2020

వాళ్ళని నేనెప్పుడూ వసంతంలోనే ఊహించుకుంటాను
తెరిచిన పుస్తకం చుట్టూ విడీవిడివడని పెదవుల
గులాబీల ప్రమాదాలతో , మధ్యాహ్నపు వలలో
సరితూకంగా నిలిచిన సీతాకోకచిలుకలలా:
పూర్తిగా అతని గొంతు ముట్టడి కింద,
ఆమెని నిశ్శబ్దంగా ఊహించుకుంటాను నేను
తన జ్వరపూరిత దృక్కులతో పాలరాతి బండలను
నిలదీస్తూ, మహారాణిని ఆమె ప్రియుడు
ఎంత తియ్యగా బాధించాడో, వింటూ,
వినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ.

వాళ్లే గనుక పూర్తిగా,
వేసవి చివరిదాకా జీవించి ఉండి ఉంటే,
ఆకురాలు కాలపు వినాశనంలోకి
కొద్దికొద్దిగా శుష్కిస్తూ పోయి ఉంటే,
ఆకులు రాలుస్తున్న చెట్లు
వాళ్ళకి కలలు కలిగించి ఉంటే,
ఎటువంటి కలలంటే,
శరీరకాంక్షతో పొంచి తిరుగుతున్న బుద్ధి
తన కోరలను ప్రేమలోకి దింపి
వాళ్ళ రహస్యాలని వేలెత్తి చూపి ఉంటే?

మనం చీకటిలోకి వెళుతూ, మరలా వస్తూ ఉన్నా
ఏమీ ప్రభావితమవని నిశ్చల సూర్యబింబంలా ప్రేమని
ఊహించుకోవటం అవసరమైన మన కోసం,
క్రూరమైన హింస, వారి అమృతత్వాన్ని
అజరామరం చేయకుండా ఉండి ఉంటే?

I imagine them always in summer,
with roses running a loose-lipped hazard
around their book, as butterflies
poised in the net of noon:
i think of her silent, wholly brought
under siege by his voice, staring
her fever down to the marble squares,
hearing and trying not to hear
how sweetly Lancelot plagued the queen.

What if they had outlived
their full-blown summer, had dwindled
into the blight of autumn
and trees shedding their leaves
had brought them dreams, such dreams
if mind on the prowl for flesh
had set its teeth on love
and pointed fingers at their furtiveness?

What if no violence
had sealed their immortality
for us, who need to think of love
as a fixed sun, impervious to our passing
in and out of the shade?