Go on and love…
poetry
telugu
sonta-kavitvam
Go on and love
Love what is;
It be a palash
Or a thorny bush,
Love what is.
Go on and love,
because it is.
ఎందుకో ఈవేళ తల ఎత్తి చూశాను
కంచెకి ఆవలి పక్క మోదుగ చెట్టు
నిలువెల్లా పూలుపూసి
వెలిగిపోతోంది
నడుచుకుంటూ వెళ్ళిపోయాను
గడ్డిలోంచి, ముళ్ల మొక్కలలోంచి
కనీకనిపించని దారిలో
దగ్గరగా, ఇంకా దగ్గరగా
చెట్టుని తాకిచూశాను
మొగ్గమొగ్గనీ పలకరించాను
నేలరాలిన కొన్ని పువ్వుల్ని
తాకి ప్రేమతో పలవరించాను
చుట్టు చుట్టూ తిరిగాను
పచ్చటి ఆకుల్నీ, నీలాకాశాన్నీ
చిరు ఎండనీ మొత్తం దృశ్యాన్నీ
గుండెల్లో నింపుకున్నాను
ఆ సంతోషాన్నీ, ఆ ప్రేమనీ
ఆ మోహాన్నీ ఆ తన్మయత్వాన్నీ
పదిలంగా పట్టుకుని
తిరిగివచ్చాను
ఆ చెట్టూ, ఆ పూలూ
ఆ సమయమూ నీలాకాశమూ
మోహమూ, ప్రేమ.