Hum Dekhenge – Telugu translation
poetry
telugu
hindi
translation
మేము చూస్తాంగా మేము చూస్తాంగా
మేము చూస్తాంగా
తప్పకుండా మేమూ చూస్తాంగా
మేము చూస్తాంగా
తప్పకుండా మేమూ చూస్తాంగా
చూస్తాంగా మేము చూస్తాంగా
ఎన్నాళ్ళు గానో వేచిన రోజు
చూస్తాంగా మేము చూస్తాంగా
ఆదిగ్రంథాల్లో రాసిన రోజు
చూస్తాంగా మేము చూస్తాంగా
కొండలై అణిచేసే అధికారం,
దూదై ఎగిరి పోయేను
అణచబడిన మా కాళ్ళ కిందా,
ఈ భూమి దడదడలాడేను
పాలించేవారి తలలపైన
ఉరుములు పిడుగులు రాలేను…..
చూస్తాంగా మేము చూస్తాంగా
ఏ రోజూ ఈ పుణ్యభూమినించి,
అసత్యం వెడలగొడతామో
సత్యవ్రతులైన సజ్జనులు,
పూజకై పిలువబడతారో
మకుటాలు నేలకు జారేను
సింహాసనాలన్నీ కూలేను…
చూస్తాంగా మేము చూస్తాంగా
దేవుని నామమే నిలిచేను,
అది వెలుగై మరుగై ఉండేను
వీక్షణం అతడే వేత్తయును
నేనే బ్రహ్మం అను జ్ఞానం,
నీలోనూ అది నాలోనూ
నిజమైన భక్తులే ఏలేరూ,
నీవునూ అది నేనూనూ
చూస్తాంగా మేము చూస్తాంగా