IN PASSING // Lisel Mueller
poetry
translation
వడబోసిన తేనెలా
ఈ అపరాహ్ణపు వెలుతురు
ఎంత వడివడిగా రాత్రిలోకి ప్రవహిస్తుందో
ముకుళించిన మొగ్గ ఒకటి
వికసించి పరిమళించేందుకు
తనకే ప్రత్యేకమైన రహస్యాన్ని విడిచేస్తోంది:
ఉన్నదంతా ఉన్నది, పోగొట్టుకోబడటానికే,
పోగొట్టుకోబడి, అమూల్యమవటానికే; అన్నట్టుగా.
How swiftly the strained honey
of afternoon light
flows into darkness
and the closed bud shrugs off
its special mystery
in order to break into blossom:
as if what exists, exists
so that it can be lost
and become precious.