కానుగ పూలు
musings
sonta-kavitvam
కొన్ని పూలు, చూస్తే చాలు…కంటికి ఇంపుగా, సొంపుగా ఉంటాయి. ఒక చూపు చూసి, వెళ్లిపోవచ్చు.
కానుగ పూలు అలా కాదు. తొందరగా కనపడవు కానీ పూసినప్పుడు చెట్టు నిండా పూలు, చెట్టు కింద పూల వాన.
చూస్తే చాలదు, అనుభవించాలి. కాసేపు నిలబడి, ఆ వగరూ, తీపీ, పులుపూ కలిసిన పచ్చటి వాసన తనివితీరా పీల్చుకుని, గుండెల్లో నింపుకుని, ఇక తప్పదన్నప్పుడే కదలగలిగేది.
పున్నాగలూ, కానుగ పూలే నా డేఫోడిల్సూ, రోజెసూ, టూలిప్సూ!