కోయిల

poetry
farmhill
telugu
Published

May 20, 2025

పక్షి రంగు నలుపా కాదా

తిన్నది మావి చిగురా వేపచెట్టుదా

గుడ్లు పెట్టిందా తానే పొదిగిందా

ఈ మీమాంసలు కావు ముఖ్యం

ఆశావహమూ మోహపూరితమూ

హృదయోల్లాసకరమూ

అయిన కూత వినిపిస్తే

అది కోయిలే!