The First Geniuses/ఆదిమ మేధావులు

poetry
translation
telugu
Published

April 23, 2020


by Billy Collins

It is so early almost nothing has happened.
Agriculture is an unplanted seed.
Music and the felt hat are thousands of years away.
The sail and the astrolabe, not even specks on the horizon.
The window and scissors: inconceivable.

దాదాపుగా ఇంకా ఏమీ జరగని
పురాతన కాలపు మొదటి రోజుల్లో,
వ్యవసాయం ఇంకా నాటని విత్తనమే
సంగీతమూ, తలపాగాలూ వేలయేళ్ళ తరువాతే
తెరచాపలూ, నక్షత్ర యంత్రాలూ
దిగంతాల అంచుల్లో కూడా కానరావు
కిటికీలు, కత్తెరలూ ఊహించటానికే లేదు

But even now, before the orchestra of history
has had time to warm up, the first geniuses
have found one another and gathered into a thoughtful group.
Gaunt, tall and bearded, as you might expect,
they stand outlined against a landscape of smoking volcanoes

అప్పటికే,
చరిత్ర తన కచేరీకి ఇంకా సరిగమలు సర్దుకోకముందే,
బుద్ధి కుశలురైన ఆదిమ మేధావులు కొందరు
ఒకరినొకరు కలుసుకున్నారు

పొగలు చిమ్మే అగ్నిపర్వతాల వెలుతురులో
ఎత్తుగా, గడ్డాలతో, బక్కచిక్కి,
రేఖామాత్రంగా కనిపిస్తున్నారు వాళ్ళు

or move along the shores of lakes, still leaden and unnamed,
or sit on high bare cliffs looking like early arrivals
at a party the earth is about to throw
now that the dinosaurs have finally cleared the room.

ఒక్కోసారి
చిక్కటి, బరువైన, ఇంకా పేర్లు లేని
సరస్సుల తీరాల వెంట నడుస్తుంటారు

ఇంకోసారి
రాక్షసబల్లులు ఖాళీ చేసి వెళ్లిన గదిలో
భూమి ఇంకా మొదలుపెట్టని సంబరాలు
చూడటానికి ముందే వచ్చిన వాళ్ళలా
ఎత్తైన మొండి కొండచరియల మీద కూర్చుని ఉంటారు.

They have yet to discover fire, much less invent the wheel,
so they wander a world mostly dark and motionless
wondering what to do with their wisdom
like young girls wonder what to do with their hair.

ఇంకా నిప్పునే రాజెయ్యలేదు వాళ్ళు
చక్రాలూ, బండ్లూ చేసేది ఇప్పుడే కాదు
అమ్మాయిలు తమ జుట్టుతో
ఏం చేయాలో తోచక సతమతమైనట్టు,
ఏమీ కదలిక లేని ఆ చీకటి ప్రపంచంలో
తమ జ్ఞానంతో ఏం చేయాలో ఆలోచిస్తూ,
ఏమీ తోచనట్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు

Once in a while someone will make a pronouncement
about the movement of the stars, the density of silence,
or the strange behaviour of water in winter,
but there is no alphabet, not a drop of ink on earth,
so the words disappear into the deep green forests
like flocks of small, startled birds.

ఉండీ ఉండీ ఒకళ్ళు
నక్షత్రాల కదలికల గురించో, నిశ్శబ్దపు చిక్కదనం గురించో
లేదా చలికాలంలో నీళ్ల విచిత్ర ప్రవర్తన గురించో
ఒక అభిప్రాయం ప్రకటిస్తారు
అప్పటికింకా అక్షరాలు లేవు
భూమిమీద ఒక్క చుక్క సిరా లేదు
ఎందుకో బెదిరి, ఎగిరి పోయి, దాక్కునే చిన్న పక్షుల గుంపులా
ఆ మాటలు, దట్టమైన పచ్చటి అడవుల్లోకి అదృశ్యమై పోతాయి

Eventually one of them will come up with the compass
or draw the first number in sand with a stick,
and he will let out a shout like Archimedes in his tub
and curious animals will look up from their grazing.

పోగా పోగా ఒకరోజు
వాళ్లలో ఒకళ్ళు దిక్సూచిని తయారు చేస్తారు
లేదా ఇసుకతో కర్రపుల్లతో మొదటి అంకె గీస్తారు
ఆర్కిమెడీస్ తొట్టిలోనుంచి అరిచినట్టుగా
అతనొక అరుపు అరుస్తాడు
పచ్చిక మేస్తున్న జంతువులు
కుతూహలంగా తలలెత్తి చూస్తాయి

Later the water screw and the catapult will appear;
the nail, the speedometer and the bow tie will follow.
But until then they can only pace the world gravely,
knowing nothing but the thrumming of their minds,
not the whereabouts of north or the notion of zero,
not even how to sharpen a stone to a deadly point.

తర్వాత్తర్వాత నీటి యంత్రాలూ, ఒడిసెలలూ వస్తాయి
ఆ వెనుకనే మేకులూ, వేగమానినులూ
భుజాల మీద కండువాలూ
అప్పటిదాకా వాళ్ళు
తమ మేధస్సుల ప్రకంపనలు తప్ప
ఉత్తర దిక్కు ఎక్కడో, సున్నా అంటే ఏమిటో,
కనీసం ఒక రాయిని ములుకుగా పదునుపెట్టటం ఎలాగో,
తెలియకుండా, గంభీరంగా, ప్రపంచమంతా తిరగవలసిందే!