ఈ లడ్డూలు ఎక్కడివి?

వంటగదిలో ప్రత్యక్షమయిన లడ్డూల కథ

Published

Mar 2022

‘కొండ తోట’ అనే ప్రకృతి బడిలో ఇరా, అవి చదువుకుంటున్నారు. వేసవి సెలవుల తరవాత ఈ రోజే బడికి తిరిగి వచ్చారు. వంటగదిలో చూస్తే లడ్డూలు ఉన్నాయి.

ఏమిటీ విశేషం అని అడిగితే వేణు అన్న వాళ్ళకి ఈ కథంతా చెప్పాడు. ఆ కథ ఏమిటో చూద్దాం రండి!

ఈ పుస్తకానికి దీప్తాన్షు సన్యాల్ బొమ్మలు వేశారు.

కొండతోట అంటే ఏదో అనుకునేరు, మేమందరం ఉండే ఫామ్ హిల్. అక్కడికి వస్తే ఇప్పుడు కూడా మీరు అవిని కలిసి మాట్లాడ వచ్చు. లడ్డూలు కూడా తినవచ్చు!

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి, తానా-మంచిపుస్తకం కలిసి రెండు సంవత్సరాలకు ఒకసారి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను ఆహ్వానిస్తున్నాయి. అలా వచ్చిన వాటిల్లో పది పుస్తకాలను ఎంపిక చేసి ప్రచురిస్తారు. 2021వ సంవత్సరానికి ఎంపికయిన పుస్తకాలలో ఇది ఒకటి.

మంచిపుస్తకం నుండి కొనుక్కోండి