మన భూమి, మన ఇల్లు వాతావరణ మార్పుపై కవితలు

భూమి కథ అంటే అది జీవితం కథ, జీవం కథ. ఇది ఒక నష్టం కథ, పర్యావరణ మార్పు వల్ల ఇంకా ఎక్కువైన ఒక హాని కథ కూడా. పర్యావరణ విపత్తు ఒక వినాశపు కథగా వినిపించినప్పటికీ, ఈ విపత్తుని ఎదుర్కోవటానికి, దాని ప్రభావం తగ్గించటానికి, దానికి తగ్గట్టుగా నడుచుకోటానికీ జరుగుతున్న ప్రయత్నాలు ఆశను కలిగిస్తున్నాయి. భవిష్యత్తు మన చేతిలోనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఈ పుస్తకంలో ఉన్న కవితలు ఒరంగుటాన్, హసదేవో అరండ్ అడవి, గంగా నది డాల్ఫిన్, పాండిచేరి సొరచేపల స్వరాల్లో ఈ కథలను వినిపిస్తాయి.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి