ఆకాశంలో అతని వంతు
అసోం రాష్ట్రంలో ఒక గ్రామంలో పెరుగుతున్న బోడో పిల్లవాడి కథలు
బర్సూ పది ఏళ్ల పిల్లవాడు. పేదరికంలో ఉన్నాడు, కానీ అతను పేదవాడు కాదు. అతను పేరున్న బడికి వెళ్లటం లేదు, కానీ ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకుంటాడు. అతని పరిధి పెద్దది కాదు, కానీ పుడమి మొత్తం అతనిది. అతని తల మీద అతని వంతు నీలి ఆకాశంతో, గంతులు వేసే కాళ్ల కింద అతని వంతు నేలతో తనవైన సాహసాలతో అతను సంబరంగా ఉంటాడు.
అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో జుయిమా నది పక్కన ఉండే ఒక బోడో గ్రామం నేపథ్యంగా చెప్పిన ‘అతని వంతు ఆకాశం’ అన్న కథలు అసాధారణమైనవి, తీవ్రంగా కదిలించేవి. తనదైన లోకంలో సంతోషంగా తిరిగి ఒక బోడో బాలుని చుట్టూ అల్లిన ఈ కథలు భిన్న పరిస్థితులను తెలియచేస్తాయి.
కొన్ని నవ్విస్తే, కొన్ని తీవ్రంగా కలిచివేస్తాయి, ఆలోచనల్లో ముంచేస్తాయి. తెలివి, హాస్యం కలగలిపిన బర్సూలో అందరు పిల్లలు తమను తాము చూసుకుంటారు. ఈశాన్య భారత గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ కథలలో బర్సూ కొంటెతనం అన్ని ప్రదేశాలలో, అన్ని కాలాలలో కనపడుతూ ఉంటుంది.