అప్పు ప్రపంచం
అయిదేళ్ళ అప్పు కేరళలో సముద్రం పక్కన ఒక ఊళ్ళో ఉంటాడు. అతని చుట్టూ అందరూ తరతరాలుగా చేపలు పట్టుకు జీవిస్తున్న మత్స్యకారులు. అక్కడి మనుషులూ, వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలే అతని ప్రపంచం. అతను పెరిగి పెద్దవటంలో ఉన్న ఆనందమూ, అందులోని బాధా, స్నేహమూ అలాగే దురాశా, నమ్మకమూ దానితో పాటు మోసమూ వంటి వాటి గురించి నేర్చుకోవటాన్ని ఈ పుస్తకంలో అతని అమాయకమైన కళ్ళలో నుంచి చూస్తాం.