ఎద్దుల జోడీ
మున్షీ ప్రేమ్ చంద్ రాసిన రెండు కథలు
మున్షీ ప్రేమ్ చంద్ (1880-1936) ఇరవయ్యవ శతాబ్దపు ప్రసిద్ధ కథకులలో ఒకరు. భారత సమాజాన్ని నిశితంగా చూసి, ఖచ్చితంగా చిత్రీకరించటం ఆయన ప్రత్యేకత. ఎద్దుల జోడీ అనే కథ అన్ని జీవుల పట్లా కరుణ కలిగిఉండటం గురించి చెబుతుంది. ముసలి అవ్వ అనే కథలో ఒక చిన్న పాపకీ, ఆమె ముసలి అవ్వకి మధ్య ఉన్న బంధాన్ని చూస్తాము.
ఎద్దుల జోడీ అనే కథ అన్ని జీవుల పట్లా కరుణ కలిగిఉండటం గురించి చెబుతుంది. హీరా, మోతీ అనే ఎద్దులు తాము పెరిగిన ఇంటి బయటి ప్రపంచపు దయలేనితనానికి బెదిరిపోతాయి. ఆ ప్రపంచంలో వాళ్ళని, మిగిలిన జంతువులనీ,వాడుకునే వారే కానీ అర్థం చేసుకునే వారు లేరు.
ముసలి అవ్వ అనే కథలో ఒక చిన్న పాపకీ, ఆమె ముసలి అవ్వకి మధ్య ఉన్న బంధాన్ని చూస్తాము. ఇంట్లో మిగిలిన అందరూ అవ్వ గురించి మరిచిపోయి, ఆమె చలితో, ఆకలితో బాధ పడుతున్నప్పుడు, లాడ్లీ తన ప్రేమతో, ఆత్మీయతతో ఆమె జీవితంలో వెలుగు నింపుతుంది.